- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ కార్మికులను కరోనా నుంచి రక్షించండి
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులను కరోనా బారి నుంచి రక్షించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కరోనా ఫస్ట్ వేవ్‌లో 30 మంది, సెకండ్ వేవ్ లో రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 80 మందికి పైగా మృతి […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులను కరోనా బారి నుంచి రక్షించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కరోనా ఫస్ట్ వేవ్‌లో 30 మంది, సెకండ్ వేవ్ లో రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 80 మందికి పైగా మృతి చెందారని, 2వేలకు పైగా వివిధ ఆసుపత్రుల్లో, హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనా రోగుల కోసం తార్నాక దవాఖానలో స్పెషల్ కొవిడ్ వార్డు, వెంటిలేటర్స్, ఆక్సిజన్, ఐపీయూ బెడ్స్, హెచ్ఆర్‌సిటీ టెస్టు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకున్న వారికి రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని, కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50లక్షల భీమా సౌకర్యంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 21 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని, కండక్టర్, డ్రైవర్లకు ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు, చేతి గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి, ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శ అబ్రహం, బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శ కె. యాదయ్య, బహుజన వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేష్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.






