రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి

by Shyam |

<p>           మతప్రాతిపదికన తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగస్వాములమై, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా నిజామాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారావు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న [&hellip;]</p>

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి
X

తప్రాతిపదికన తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగస్వాములమై, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా నిజామాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారావు మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీ రేటు, ఆర్థిక సంక్షోభాన్ని, ప్రభుత్వ రంగాల అమ్మకాన్ని కప్పిపుచ్చుకోవడానికే మోడీ ప్రభుత్వం ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ లను ముందుకు తీసుకొచ్చిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం.. అంబానీ, ఆదానీల వంటి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ప్రజలను కులం, మతం పేరుతో విభజించి పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ఈ విధానాలను వ్యతిరేకించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు యూనివర్సిటీ కేంద్రాలుగా పోరాడుతున్నారన్నారు. మోడీ ప్రజావ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టి నిజమైన దేశభక్తులమని చాటుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక అధ్యక్షులు మాధవరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సిపిఎం జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు భాస్కర్, తదితరులతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు పాటలతో అలరించారు.

Next Story