ఫ్యాషన్ డిజైనర్ సెక్స్ రాకెట్.. బెడ్ రూంలో ఆ స్థితిలో దొరికిన ఉద్యోగి

by  |
hyderabad crime news
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో వ్యభిచార దందాలు ఎక్కువైపోతున్నాయి. చదువు ముసుగులో, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇలా యువతులను నమ్మించి వ్యభిచారంలోకి దించుతున్నారు కొంతమంది. తాజాగా ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచార దందా నడిపిస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటుగా విటుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. సునీల్ మండల్(40) అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. కుషాయిగూడ వాసవీశివనగర్‌ పార్కు సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్న ఆమె కొన్ని నెలలుగా ఆ ఇంటిని వ్యభిచార గృహంగా మార్చేసింది. అయితే ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆ ఇంటిపై రైడ్ చేశారు. కాగా.. అదే ఇంట్లో అద్దెకుంటున్న బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్‌రూంలో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో వారందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story