దిగుమతి సుంకం పెంపుతో దేశీయ బ్రాండ్‌లపై ప్రభావం

by  |
దిగుమతి సుంకం పెంపుతో దేశీయ బ్రాండ్‌లపై ప్రభావం
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్‌ఫొన్ విడిభాగాల దిగుమతులపై సుంకాన్ని పెంచడం వల్ల దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్ కంపెనీలు ప్రభావితమయ్యే అవకాశముందని పరిశ్రమలు భావిస్తున్నాయి. ప్రధానంగా రూ. 10 వేల ధరల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ ధరలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఈ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించే షియోమీ వంటి మార్కెట్ లీడర్ కంపెనీలు లాభపడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కెమెరా మాడ్యుల్స్, కనెక్టర్లపై 2.5 శాతనికి పెంచాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఛార్జర్, అడాప్టర్‌లపై ఏకంగా 10 శాతం పెంచారు. ‘ఈ నిర్ణయం ద్వారా ఫీచర్ ఫోన్‌లు, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీనివల్ల దేశీయ బ్రాండ్ లావా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. డిస్‌ప్లే పరికరాలపై 10 శాతం పెంపుపై ఇప్పటికే పోరాడుతున్నాం. ఇప్పుడు తాజా నిర్ణయంతో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని’ లావా ఇంటర్నేషన్ హెడ్ బిబాష్ చెప్పారు. అయితే, ప్రాధాన్యత రంగాలపై స్థానిక ఆర్ అండ్ డీని బలోపేతం చేసేందుకు రూ. 50 వేల కోట్లు కేటాయించడం వల్ల లావా కంపెనీ అంతర్జాతీయ బ్రాండ్‌లతో ఫోటీపడేందుకు వీలవుతుందని ఆయన వెల్లడించారు.


Next Story