- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లింబాద్రిని సందర్శించిన ‘వకీల్‌సాబ్’ నిర్మాత
by Shyam |
<p>దిశ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శనివారం సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ పురోహితులు దిల్‌రాజుకి శాలువా కప్పి ఆహ్వానించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏకాదశి కావడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. కాగా, ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ అనే […]</p>

X
దిశ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శనివారం సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ పురోహితులు దిల్‌రాజుకి శాలువా కప్పి ఆహ్వానించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏకాదశి కావడంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. కాగా, ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ అనే చిత్రాన్ని నిర్మించి, దిల్‌రాజు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
Next Story






