- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకటి కాదు.. రెండు : పుష్పపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
<p>దిశ, సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. ఇటీవలే బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ ప్రస్తుతం 64 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ కాగా, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా విడుదల చేయబోతున్నారనే న్యూస్ కొన్ని […]</p>

దిశ, సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. ఇటీవలే బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ ప్రస్తుతం 64 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ కాగా, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా విడుదల చేయబోతున్నారనే న్యూస్ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తుండగా.. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. చిత్ర నిర్మాత వై. రవిశంకర్ ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసేశారు. ఈ కథను రెండు గంటల్లో చెప్పడం కష్టమని తెలిపిన ఆయన.. హీరో, డైరెక్టర్‌తో చర్చించిన తర్వాత పార్ట్ 2 కూడా తెరకెక్కించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ చిత్రీకరణ మొదలుపెడతామని వెల్లడించారు.






