- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా భూముల్లోకి ఎందుకు వస్తున్నారు.. టీఆర్ఎస్ నేతలకు బిగ్ షాక్
<p>దిశ, హసన్‌పర్తి : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ గర్జన సభకు ఆటంకాలు తొలగడం లేదు. ఇప్పటికే 15వ తేదీన జరగాల్సిన సభను 29వ తేదీకి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి టీఆర్‌ఎస్ సత్తా చాటాలని భావిస్తున్న అధినేత కేసీఆర్‌కు.. వరంగల్‌లో పరిస్థితులు అనుకూలించే విధంగా లేకపోవడం గమనార్హం. భారీ బహిరంగ సభకు అనువైన స్థలం కోసం దాదాపు నెలరోజులుగా […]</p>

దిశ, హసన్‌పర్తి : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ గర్జన సభకు ఆటంకాలు తొలగడం లేదు. ఇప్పటికే 15వ తేదీన జరగాల్సిన సభను 29వ తేదీకి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. పది లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి టీఆర్‌ఎస్ సత్తా చాటాలని భావిస్తున్న అధినేత కేసీఆర్‌కు.. వరంగల్‌లో పరిస్థితులు అనుకూలించే విధంగా లేకపోవడం గమనార్హం. భారీ బహిరంగ సభకు అనువైన స్థలం కోసం దాదాపు నెలరోజులుగా వరంగల్ టీఆర్‌ఎస్ నేతలు అన్వేషిస్తున్నారు. అన్నింటిలోకి హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట వద్ద ఉన్న స్థలాలు అనువుగా ఉంటాయని నేతలు భావిస్తున్నారు.
అయితే బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మా భూముల సరిహద్దులు చెరిపేస్తారు.. ప్లాట్ల రాళ్లు పీకేస్తారు…! పొలాలు నాశనమవుతాయని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల పరిశీలనకు వెళ్లిన ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలకు నిరసన సెగ తగిలింది. ఈ క్రమంలోనే స్థానిక మాజీ కార్పొరేటర్ రాజునాయక్, కొంతమంది రైతులకు ఘర్షణ కూడా జరిగింది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ పరిణామాలతో రైతులకు ఇష్టం లేకుండా, వారి అనుమతి లేకుండా.. రైతుల భూముల్లోకి అడుగుపెట్టబోమని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మరీ స్పష్టం చేశారు.
మళ్లీ లొల్లి..
దేవన్నపేట రైతుల భూముల్లోకి కొంతమంది టీఆర్‌ఎస్ నేతలు శనివారం పరిశీలన పేరుతో వెళ్లడంతో మళ్లీ లొల్లి మొదలైంది. పదేపదే మా భూముల్లోకి ఎందుకు వస్తున్నారంటూ రైతులు నేతలపై విరుచుకుపడ్డారు. వ్యవసాయ భూముల్లో అడుగుపెట్టేందుకు మీకెక్కడిది అధికారం.. ఎవరిచ్చారు ఆ అధికారం.. మా కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూముల్లోకి.. అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ నిలదీశారు. పోలీసులు మొహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే రైతుల భూముల్లోకి రావడం లేదంటూ ఆందోళన చేస్తున్న వారికి నేతలు నచ్చజెప్పి పంపించడం గమనార్హం. కాగా, అనుమతి లేకుండా రైతుల భూముల్లోకి రాము అంటూనే సాయంత్రం కొన్ని ఖాళీ స్థలాల్లో బహిరంగ సభ కోసం చదును, శుద్ధి పనులను మొదలుపెట్టడం గమనార్హం.
- Tags
- Hasanparthy






