తమిళ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన టాక్సీవాలా భామ

by  |
priya
X

దిశ, సినిమా : ‘టాక్సీవాలా’ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.. తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాల ద్వారా వరుస సక్సెస్‌లు అందుకుంది. ప్రస్తుతం తన చిత్రాలే థియేటర్‌లో ఆడుతుండగా.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు సినిమా హాల్స్‌కు వస్తారా లేదా? అనే డౌట్ ఉండేదని, కానీ జాగ్రత్తలు పాటిస్తూనే సినిమాను ఎంజాయ్ చేసేందుకు వచ్చేస్తున్నారని తెలిపింది. తిమ్మరుసు తర్వాత గ్లామర్‌పై కేర్ తీసుకుంటున్నానన్న భామ.. వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పింది. అందుకే తనే స్వయంగా వంట చేసుకుంటున్నట్లు తెలిపింది.

ఇక టాక్సీవాలా సినిమా హిట్ అయ్యాక స్క్రిప్ట్ నచ్చితేనే మూవీ ఓకే చేయాలని డిసైడ్ అయ్యానని తెలిపింది. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘గమనం’లోనూ మంచి పాత్ర చేశానన్న ప్రియాంక.. స్నేహితులే తనకు పెద్ద విమర్శకులని చెప్పింది. డైరెక్టర్ సూచించినట్లు యాక్ట్ చేయడమే లక్ష్యమన్న భామ.. కొన్ని తెలుగు స్క్రిప్ట్స్ విన్నానని, ఓటీటీ ఆఫర్స్ కూడా వస్తున్నాయని, తమిళ్‌లో ఓ సినిమాకు ఆల్రెడీ సైన్ చేశానని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపింది.

Next Story