ఐసొలేషన్‌లోకి ప్రియాంక.. ర్యాలీలు క్యాన్సిల్

by  |
Priyanka vadra
X

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ వాద్రా శనివారం సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్తున్నట్టు వెల్లడించారు. ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు తనకు నెగెటివ్ వచ్చినప్పటికీ ఐసొలేషన్‌లోకి వెళ్తున్నట్టు ట్వీట్ చేశారు. తాను కొన్ని రోజులు ఐసొలేషన్‌‌లో ఉంటానని, ఫలితంగా తాను పాల్గొనాల్సి ఉన్న ర్యాలీలు రద్దయినట్టుగా భావించాలని తెలిపారు. తమిళనాడు, కేరళ, అసోంలలో ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా పలు ర్యాలీలు నిర్వహించాల్సి ఉండగా వాటన్నింటినీ క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రియాంక నిర్ణయానికి ముందే రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ పోస్టులో తాను కరోనా బారినపడ్డట్టు వెల్లడించారు. కరోనా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ప్రియాంక గాంధీకి నెగెటివ్ వచ్చినప్పటికీ ఇరువురూ ఐసొలేషన్‌లోకి వెళ్తున్నట్టు పేర్కొన్నారు.


Next Story

Most Viewed