- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియాంక చోప్రా ‘ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ’
<p>బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా తన భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండే ప్రియాంక.. ఎప్పటికప్పుడు తన క్వారంటైన్ విశేషాలను షేర్ చేసుకుంటోంది. తాజాగా తన ఫోటోలను షేర్ చేసి.. ‘ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ’ అంటూ క్యాప్షన్ జతచేసింది. రెండు నెలల తర్వాత ఇటీవలే మాస్క్ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకొచ్చిన ఓ ఫోటోను షేర్ చేసిన ప్రియాంక.. […]</p>

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా తన భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండే ప్రియాంక.. ఎప్పటికప్పుడు తన క్వారంటైన్ విశేషాలను షేర్ చేసుకుంటోంది. తాజాగా తన ఫోటోలను షేర్ చేసి.. ‘ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ’ అంటూ క్యాప్షన్ జతచేసింది.
రెండు నెలల తర్వాత ఇటీవలే మాస్క్ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకొచ్చిన ఓ ఫోటోను షేర్ చేసిన ప్రియాంక.. తాజాగా మరో రెండు ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. మొదటి ఫోటోలో పింక్ స్విమ్ సూట్ ధరించి, దానిపై ఓ షర్ట్ వేసుకుని తన అందాలను ఆరబోసింది. ఇక రెండో ఫోటోలో అసలు తన ముఖం కూడా కనపడకుండా కవర్ చేసుకుంది. పైగా ‘మన ఎక్స్‌పెక్టేషన్ పీక్స్ లెవల్లో ఉంటాయి.. కానీ రియాలిటీ మాత్రం వేరేలా ఉంటుందని’ సెలవిస్తోంది. ప్రియాంక్ హాట్ లుక్స్‌పై నెటిజన్లు రకరకాల ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తుండగా.. తన అభిమానులను మాత్రం ఈ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.






