ప్రియదర్శి.. టీవీ9 రవిప్రకాశ్ పాత్ర చేస్తున్నాడా?

by  |
ప్రియదర్శి.. టీవీ9 రవిప్రకాశ్ పాత్ర చేస్తున్నాడా?
X

దిశ, సినిమా: కమెడియన్ ప్రియదర్శి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘మల్లేశం’ సినిమాతో పాటు ‘లూజర్’ వంటి సిరీస్‌ల్లో లీడ్ క్యారెక్టర్స్‌తోనూ మెప్పించాడు. ఇక తాజాగా త్వరలో రిలీజ్ కానున్న అల్లరి నరేశ్ ‘నాంది’ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుండగా.. ఆ క్యారెక్టర్‌ను టీవీ9 జర్నలిస్ట్ రవిప్రకాశ్ జీవితకథ ఆధారంగా దర్శకుడు డిజైన్ చేశాడని సమాచారం. ఈ పాత్రలో ప్రియదర్శి అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోనుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రవిప్రకాశ్ లైఫ్ బేస్ చేసుకున్న క్యారెక్టర్ స్క్రీన్ మీద చూడాలంటే.. ఫిబ్రవరి 19న ‘నాంది’ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.


Next Story