పాట పాడిన ప్రియా వారియర్

by  |
పాట పాడిన ప్రియా వారియర్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తన గురించి ఎన్నిసార్లు నెగెటివ్ కామెంట్స్ వచ్చినా పాజిటివ్‌గానే స్పందించిన ప్రియ.. మలయాళం, తెలుగులో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే పలు యాడ్స్‌లో నటించి బ్రాండ్ అంబాసిడర్‌గానూ మారిపోయిన భామ.. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో వస్తున్న ‘చెక్’ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ప్రియా వారియర్‌లోని మరో టాలెంట్ బయటకు వచ్చినట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల రూపొందిస్తున్న ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ప్రియప్రకాశ్‌ను తెలుగులో సింగర్‌గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తి కాగా.. శ్రీచరణ్ ‘కృష్ణ అండ్ హిజ్ లీలా, గతం, తిమ్మరుసు, మా వింత గాథ వినుమా’ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. కాగా ఈ మధ్య ఫ్రెండ్ పెళ్లికి హాజరైన ప్రియ వారియర్ పాట పాడగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.



Next Story

Most Viewed