ప్రైవేట్ టీచర్లను ‘ఉత్తమ’ లుగా గుర్తించాలి

by  |
private-teachers
X

దిశ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 3 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తక్కువ జీతాలతో రోజుకు 8 నుండి 12 గంటలకు పైగా పనిచేస్తూ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోటీ పరీక్షల్లో రాణించడం కోసం ప్రైవేట్ టీచర్స్ ఎంతో కష్టపడుతూ ఫలితాలను రాబడుతున్నారు. పనిచేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపును ఇస్తుంది. అందులో చదివే పిల్లలను కూడా ప్రభుత్వం గుర్తించి వివిధ పరీక్షలకు, స్కాలర్ షిప్ లకు ఎంపిక చేస్తోంది. మరి అలాంటప్పుడు ప్రైవేట్ టీచర్స్ ను ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు అనేదే మా ప్రశ్న.

లాక్ డౌన్ టైంలో వేలాది మంది ఉపాధ్యాయులు కేవలం 30-50 శాతం జీతాలతో ప్రతిరోజూ ఆన్లైన్లో గంటల తరబడి క్లాసులు చెప్పారు. మన ప్రభుత్వాలు సెప్టెంబర్ 5 న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని వైభవంగా జరుపుతున్నాయి. ఆ రోజున ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరిస్తుంది. మరి ప్రైవేట్ ఉపాధ్యాయులను ఎందుకు గుర్తించడం లేదు?…ఎందుకు సత్కరించవు? అనేదే ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుడి ప్రశ్న.

ఉపాధ్యాయ దినోత్సవం ప్రభుత్వ టీచర్లదే కాదు. ప్రైవేట్ టీచర్లది కూడా. ఉత్తమ ఉపాధ్యాయులుగా కేవలం ప్రభుత్వ పాఠశాలల నుంచే కాకుండా ప్రైవేల్ స్కూల్స్ నుంచి కూడా ఎంపిక చేయాలన్నదే మా విన్నపం. కాబట్టి సెప్టెంబర్ 5 న జరుపుకునే గురుపూజోత్సవం సందర్భంగా ప్రైవేట్ టీచర్స్ ను కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షాన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.



Next Story

Most Viewed