‘ఆ రోజు రాత్రి 24 జీవితాలు నాశనమయ్యాయి’

by  |
Kuruthi Trailer
X

దిశ, సినిమా: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కురుతి’ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆగస్టు 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న ఈ రివేంజ్ డ్రామా ట్రైలర్ ఫస్ట్ టు ఎండ్ థ్రిల్లింగ్‌గా సాగింది. ముందుగా కేరళలోని ఎరట్టుపేటకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఒంటరి జీవితంలోకి తీసుకెళ్లిన ట్రైలర్.. గతంలోని చేదు జ్ఞాపకాలను చెరిపేసుకుందామనుకున్న అతని దగ్గర గాయపడిన పోలీసు ఖైదీతో కలిసి ఆశ్రయం పొందేందుకు వస్తాడు. కానీ ప్రతీకారంతో రగిలిపోతున్న శత్రువు తనను వెంటాడగా.. ఇబ్రహీం తన సొంత నమ్మకాల గురించి పరీక్షించుకోవాల్సి వస్తుంది. ‘మనిషి రెండు కాళ్లపై నడిచినంత వరకు.. కొట్టుకోవడం, చంపుకోవడం ఆపడు’ ‘ప్రతీ హామీకి మూల్యం చెల్లించుకోవాల్సిందే’ అనే స్టోరీ లైన్‌తో తెరకెక్కుతున్న సినిమాలో.. ‘ ఆ రోజు రాత్రి 24 జీవితాలు నాశనమయ్యాయి? ఇంతకీ వారు ఎవరు? రివేంజ్ డ్రామా ఏంటి? అనేది కథ. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన సినిమా ద్వారా మను వారియర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.



Next Story

Most Viewed