మలయాళంలోనూ ‘అందాధున్’.. గ్రేట్ చాన్స్ కొట్టేసిన రాశి

by  |
మలయాళంలోనూ ‘అందాధున్’.. గ్రేట్ చాన్స్ కొట్టేసిన రాశి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అందాధున్’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. టబు బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేయగా..రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించిన చిత్రం అన్ని ఇండస్ట్రీలను ఆకర్షించింది. దీంతో ఈ సినిమాను ఇప్పటికే పలు భాషల్లోకి రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

తెలుగులో మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో నితిన్ ఈ ప్రాజెక్ట్ రీమేక్ చేయబోతుండగా తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక తమిళ్‌లో హీరో ప్రశాంత్ నటిస్తుండగా.. సిమ్రన్ టబు పాత్రలో కనిపించబోతోంది. కాగా, ‘అందాధున్’ను మలయాళంలోనూ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. రవి కె చంద్రన్ డైరెక్షన్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తుండగా..హీరోయిన్ రాశీ ఖన్నా ఈ ప్రాజెక్ట్‌కు సెలెక్ట్ అయిందని సమాచారం. రాధికా ఆప్టే ప్లే చేసిన క్యారెక్టర్‌లో రాశీ నటించబోతుండగా..టబు క్యారెక్టర్ ఎవరు ప్లే చేయబోతున్నారనే దాని గురించి అప్‌డేట్ రావాల్సి ఉంది.



Next Story

Most Viewed