కొండపై నుంచి జారిపడిన పూజారి.. అంతలోనే

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-21 00:47:49  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లా శింగనమలలో అపశృతి చోటు చేసుకుంది. దేవుడికి పూజలు చేస్తున్న సమయంలో పూజారి కాలు జారి లోయలో పడి మృతి చెందాడు. శ్రీ గంపమల్లయ్య స్వామికి శనివారం ఉదయం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పూజారి దేవుడికి హారతిస్తూ కాలు జారీ వంద అడుగులు ఉన్న కొండపై నుంచి కింద పడ్డాడు. దీంతో పూజారి అక్కడికక్కడే మృతి చెందాడు. పూజారి మృతితో ఆలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు [&hellip;]</p>

కొండపై నుంచి జారిపడిన పూజారి.. అంతలోనే
X

దిశ, వెబ్‌డెస్క్ : అనంతపురం జిల్లా శింగనమలలో అపశృతి చోటు చేసుకుంది. దేవుడికి పూజలు చేస్తున్న సమయంలో పూజారి కాలు జారి లోయలో పడి మృతి చెందాడు. శ్రీ గంపమల్లయ్య స్వామికి శనివారం ఉదయం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పూజారి దేవుడికి హారతిస్తూ కాలు జారీ వంద అడుగులు ఉన్న కొండపై నుంచి కింద పడ్డాడు. దీంతో పూజారి అక్కడికక్కడే మృతి చెందాడు. పూజారి మృతితో ఆలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story