పీవీపీ అరెస్టుకు రంగం సిద్ధం

by  |
పీవీపీ అరెస్టుకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అరెస్టుకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద పీవిపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్.14లోని ఆయన నివాసం వద్ద గోడవివాదంలో.. కైలాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం పీవీపీ విల్లాస్‌లో కైలాష్ అనే వ్యక్తి ఇళ్లు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన సమయంలో ఎలాంటి రూల్స్ పెట్టకుండా, ఇప్పుడు తనకు ఇష్టం వచ్చిన రూల్స్ పెడుతున్నాడని కైలాష్ తెలిపారు. బుధవారం టెర్రస్‌పై గార్డెన్‌ నిర్మిస్తుంటే, పీవీపీ వచ్చి నిర్మించొద్దని బెదిరిస్తున్నాడని కైలాష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయగా, 40 మంది వ్యక్తులను తమ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పీవీపీ పాల్పడ్డారని కైలాష్ ఆరోపించారు.


Next Story

Most Viewed