నిరుద్యోగుల సమస్యలపై గళం విప్పుతా

12

దిశ, దేవరకొండ: ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించి మండలికి పంపిస్తే నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతానని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బహుజన రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లాలూ నాయక్, దళిత యువజన జేఏసీ కన్వీనర్ ఎర్ర కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యను వ్యాపారం చేస్తున్న పల్లా రాజేశ్వర్‎రెడ్డికి పట్టభద్రులు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పట్టభద్రుల సమస్యలపై ఏనాడు నోరు విప్పలేదని ఆరోపించారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే అధికారం ఒక్క కుటుంబం చేతుల్లోనే ఉందని.. ఈ పాలనలో ప్రశ్నించే బలమైన గొంతుకను శాసనమండలికి పంపాలని కోరారు.