అల్లం గారెల రుచేవేరు

241

దిశ, వెబ్ డెస్క్ : అల్లం గారెలు తయారు చేయడం చాలా సులభం. పల్లీ చట్నీ, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీతో కానీ, సాంబార్ తో కానీ ఈ గారెలు తింటే చాలా బాగుంటాయి. అల్లం గారెలు తయారు చేసే విధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలిసిన పదార్థాలు….

1. మినప్పప్పు రెండు కప్పులు ( నాలుగు గంటల ముందే నాన బెట్టుకోవాలి )
2. అల్లంముద్ద రెండు టీస్పూన్లు
4. జిలకర్ర 2 టీస్పూన్లు
5. మిరియాలు అరటీస్పూన్
6. ఉల్లిపాయ తరుగు రెండు టేబుల్ స్పూన్లు
7. ఎండుకొబ్బరి తురుము ఒక టీస్పూన్
8. ఉప్పు
9. లవంగాలు రెండు
10. దాల్చన చెక్క చిన్నముక్క
11. నూనె సరిపడ
12. కరివేపాకు ఒక రెబ్బ 

తయారీ విధానం : ముందుగా మిక్సిలో పచ్చిమిర్చి, జీలకర్ర మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం ముద్ద, ఎండుకొబ్బరి తురుము, మిరియాలు వేసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన మినపపప్పును మిక్సీ పట్టాలి. మెత్తగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమం, సరిపడ ఉప్పు వేసుకుని మరోసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్ లో కి తీసుకోవాలి. అందులో ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసుకుని మరోసారి మెత్తగా కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక, ఒక చిన్న కవర్ పై చిన్న చిన్న గారెలుగా చేసుకుని ఒక ఐదు నిమిషాల వరకూ వేయించుకోవాలి. అంతే టేస్టీ అల్లం గారెలు రెడీ.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..