సుశాంత్.. కన్నీళ్లు తెప్పించావు : ప్రీతి

by  |
సుశాంత్.. కన్నీళ్లు తెప్పించావు : ప్రీతి
X

ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరగా నటించిన చిత్రం.. ‘దిల్ బెచారా’. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జూలై 24న విడుదలైంది. కాగా, సినిమా చూసిన వాళ్లంతా.. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎంతోమంది సెలెబ్రిటీలు ఎమోషనల్ పోస్ట్‌‌లు పెట్టారు. బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా ఇప్పటికే ఈ సినిమా చూసి ఎమోషనల్ అయ్యింది. తాజాగా మరోసారి సినిమా చూస్తూ.. భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.

‘సుశాంత్ నీ పాత్రకు నువ్వు పూర్తి న్యాయం చేశావు. ఈ సినిమా ఆద్యంతం రోలర్ కోస్టర్‌లా ఎమోషనల్ జర్నీని అందిస్తుంది. ఈ సినిమా కన్నీటిని తెప్పించింది. సుశాంత్ చివరి చిత్రానికి న్యాయం చేసినందుకు ముఖేష్ చాబ్రాకు ధన్యవాదాలు. సంజనా సంఘీతో పాటు అందరూ ఎంతో గొప్పగా నటించారు. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. చేదు నిజం.. మిస్ యూ’ అంటూ సుశాంత్‌ను తలచుకుంది ప్రీతి. ఈ చిత్రంలో సంజనా సంఘీ, సైఫ్‌ అలీఖాన్‌(అతిథి పాత్ర), స్వస్థికా ముఖర్జీ తదితరులు న‌టించ‌గా, ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు.

https://www.instagram.com/p/CDclYnqFvXN/

Next Story

Most Viewed