టాలీవుడ్‌లో ముదిరిన ‘మా’ గొడవ.. కొట్లాడేందుకు ప్రకాశ్ రాజ్ రెడీ..!

94
actor prakash raj

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ‘మా’ గొడవ మరింత ముదిరింది. ప్రకాశ్ రాజ్‌ ప్యానల్‌పై మంచు విష్ణు విజయం సాధించి.. మా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. కానీ, పరాజయం పొందిన ప్రకాశ్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఈసీ అందుకు అంగీకరించలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు కూడా రాజీనామా బాటలోనే ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు.

మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ రిగ్గింగ్‌కు పాల్పడిందని.. ఇందుకోసం సోమవారం కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఇదివరకే ఎన్నికలు జరిగిన తీరుపై పూర్తి సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ఓపెన్ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కోర్టు మెట్లు ఎక్కెందుకు కూడా సిద్ధం అవడంతో టాలీవుడ్‌లో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దీనిపై ప్రస్తుత మా అధ్యక్షుడు విష్ణు ఎలా స్పందిస్తాడో అనేది వేచి చూడాల్సిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..