'మా'కు రాజీనామా.. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ కామెంట్స్

by  |
మాకు రాజీనామా.. ప్రకాష్ రాజ్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హోరాహోరీగా జరిగిన మా ఎన్నికల్లో ఓటమిపాలైన సినీ నటుడు ప్రకాష్ రాజు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆదివారం మా ఎన్నికల ఫలితాల అనంతరం కొద్దిసేపటికే మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు నాగబాబు వెల్లడించాడు. అనంతరం ఇవాళ ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుందనేది హాట్‌టాపిక్‌గా మారింది.

రాజీనామా ప్రకటిస్తూ మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్న నిర్ణయం కాదని, అతిథిగానే వచ్చా.. అతిథిగానే ఉంటానని అన్నారు. మా ఎన్నికలు సరిగ్గా జరిగాయని, గెలిచిన ప్రతిఒక్కరికీ అభినందనలు అని తెలిపారు. ‘చైతన్యంతో ఎక్కువమంది ఓట్లు వేశారు. గెస్ట్‌గా వచ్చాను. గెస్ట్ గా ఉంటాను. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా. నేను తెలుగు వాడిని కాదు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా తప్పు కాదు. నా తల్లిదండ్రుల తప్పు కాదు. తెలుగు వ్యక్తే మా అధ్యక్షుడిగా ఉండాలనుకున్నారు. తెలుగువాడిగా పుట్టనందుకు చింతిస్తున్నా. మాతో నాకు 21 ఏళ్లు అనుబంధం ఉంది’ అని ప్రకాష్ రాజు తెలిపారు.

Next Story

Most Viewed