ప్రభుదేవాతో నయన్ ప్రాజెక్ట్.. కోలీవుడ్ టాక్

by  |
ప్రభుదేవాతో నయన్ ప్రాజెక్ట్.. కోలీవుడ్ టాక్
X

లేడీ సూపర్‌స్టార్ నయనతార యాక్టింగ్ స్కిల్స్ ఎంత ఫేమసో.. తన లవ్ బ్రేకప్స్ అంత కన్నా ఎక్కువ ఫేమస్. శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ తర్వాత ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్న ఈ మళయాళ భామ.. మరోసారి మాజీప్రియుడు ప్రభుదేవాతో సినిమా చేయబోతుందని టాక్. యాక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా రాణిస్తున్న ప్రభుదేవా మరోసారి నయన్‌తో జతకట్టడం కోలీవుడ్ క్రేజీ న్యూస్ అయింది.

నిర్మాత ఐసరాయ గణేశ్.. ప్రభుదేవా డైరెక్షన్‌లో కార్తీ, విశాల్ హీరోలుగా సినిమా తెరకెక్కించాలని నిర్ణయించారు. కానీ ఆ ప్రాజెక్ట్ కాస్త కొన్ని కారణాల వల్ల మరుగునపడింది. అదే కథకు మెరుగులుదిద్దుతూ మరోసారి మెగా ఫోన్ పట్టాబోతున్నాడట ప్రభుదేవా. కార్తీ పాత్ర తనే చేస్తుండగా.. విశాల్ పాత్రను కాస్త చేంజ్ చేసి నయన్‌ను సినిమాకు ఓకే చేయించారట. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రభు, నయన్‌ల బంధాన్ని పాత బంధాన్ని మళ్లీ గుర్తుకు చేస్తుందా? లేక ఫ్రెండ్లీగానే ఉంటారా? అనేది ప్రస్తుతం కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ. కాగా ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంతతో కలిసి నయన్ మరో ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది.



Next Story

Most Viewed