సోషల్ మీడియాలో ప్రభాస్ సౌత్ రికార్డ్

by  |
సోషల్ మీడియాలో ప్రభాస్ సౌత్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: బాహుబలి సినిమాతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు ప్రభాస్. ఈ ఒక్క సినిమాతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. సాహో సినిమాలో స్టైలిష్ లుక్ అండ్ యాక్టింగ్ తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్.. తర్వాత మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ చేస్తుండగా.. ఫ్యాన్ ఫాలోయింగ్ బాహుబలి కలెక్షన్స్ లా దూసుకుపోయింది.

సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఫేస్ బుక్ లో 20 మిలియన్ల ఫాలోయింగ్ తో రికార్డ్ సృష్టించాడు ప్రభాస్. దీంతో సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన నటుడిగా ఘనత సొంతం చేసుకున్నాడు. 20 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ సెట్ చేసిన ప్రభాస్.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. 20 మిలియన్ లవ్ కు థాంక్యూ డార్లింగ్స్ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా మూడు నెలల క్రితం 15 మిలియన్ మార్క్ కలిగిన బన్నీని క్రాస్ చేసిన ప్రభాస్.. చాలా తక్కువ సమయంలో 20 మిలియన్ ఫాలోవర్స్ తో సంపాదించుకుని ఖుష్ అవుతున్నాడు.



Next Story

Most Viewed