- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాలోయింగ్‌లోనూ రెబల్ స్టారే టాప్
<p>యాక్షన్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. తన నటన, వ్యక్తిత్వంతో.. తెలుగు సినిమా పరిశ్రమకు ‘డార్లింగ్’ గా మారిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్‌గా నిలిచాడు. బాహుబలితో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన డార్లింగ్.. సోషల్ మీడియాలోనూ సౌత్ టాప్ లేపారు. తాజాగా ప్రభాస్ ఫేస్‌బుక్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్లకు చేరింది. ఇప్పటి వరకు దక్షిణాది నటుల్లో తొలిసారి ఈ ఫీట్ అందుకున్న స్టార్‌గా ప్రభాస్ […]</p>

యాక్షన్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. తన నటన, వ్యక్తిత్వంతో.. తెలుగు సినిమా పరిశ్రమకు ‘డార్లింగ్’ గా మారిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్‌గా నిలిచాడు. బాహుబలితో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన డార్లింగ్.. సోషల్ మీడియాలోనూ సౌత్ టాప్ లేపారు. తాజాగా ప్రభాస్ ఫేస్‌బుక్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్లకు చేరింది. ఇప్పటి వరకు దక్షిణాది నటుల్లో తొలిసారి ఈ ఫీట్ అందుకున్న స్టార్‌గా ప్రభాస్ నిలవడం విశేషం.
ఇక 13 మిలియన్ల ఫాలోవర్స్‌తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రభాస్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నారు. మూడో స్థానంలో.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఉండగా, రౌడీ స్టార్ విజయ దేవరకొండ నాలుగో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఫీమేల్ ఫాలోయింగ్‌తో పాటు బాలీవుడ్‌లో ప్రభాస్‌కున్న పాపులారిటీనే అతన్ని సోషల్ మీడియాలో టాప్ స్థానంలో నిలబెట్టాయని చెప్పొచ్చు. ప్రభాస్ రాబోయే చిత్రం కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో జట్టు కట్టనున్నారు.






