రొమాంటిక్‌గా ప్రభాస్ @ రాధేశ్యామ్

by  |
రొమాంటిక్‌గా ప్రభాస్ @ రాధేశ్యామ్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20 వ చిత్రం అప్ డేట్ గురించి అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందే బెల్జియం షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కావడం.. ఆ టైమ్ లోనే ఫస్ట్ లుక్ త్వరలో విడుదల అవుతుందని డైరెక్టర్ రాధ కృష్ణ కుమార్ ప్రకటించారు. కానీ ఆ ముహూర్తం 115 రోజుల తర్వాత కానీ కుదర్లేదు.

ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ అదిరిపోగా.. రాధే శ్యామ్ టైటిల్ ఖరారు చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా పిరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టొరీ కాగా.. ఫస్ట్ లుక్ అలాగే ఉంది. లోకం ఏం అయిపోయినా సరే ప్రేమించిన వ్యక్తి కావాలి అనే విధంగా ఉన్న ఫస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వైట్ సూట్ లో సూపర్ హ్యాండ్ సమ్ ప్రభాస్, రెడ్ గౌన్ లో గార్జియస్ గా ఉన్న పూజాల రొమాంటిక్ పోజ్ అభిమానులను ఆకట్టుకోగా… సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఫ్యూచర్ టెల్లర్ గా కనిపించనుండగా.. పూజ యువరాణిగా అలరించనుందట.

యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ ఫిల్మ్స్, టి సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో 2021లో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపింది మూవీ యూనిట్.


Next Story

Most Viewed