ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

by  |
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
X

బాహుబలితో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సాహోతో తనను తాను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసుకున్నాడు. అయితే ప్రభాస్.. తన 20వ సినిమాను వెంటనే రిలీజ్ చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చినా వర్క్ ఔట్ కాలేదు. కనీసం సినిమా పేరేంటి అనేది కూడా రివీల్ చేయలేదు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ అండ్ రొమాంటిక్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుండగా.. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, అభిమానులు చాలా కాలంగా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ప్రకటించింది మూవీ యూనిట్. జులై 10న ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్, సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు రివీల్ చేసింది. కాగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో రూపుదిద్దుకున్న సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.


Next Story

Most Viewed