బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రానివ్వకండి.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by  |
mp
X

దిశ, రామాయంపేట: బీజేపీ అంటేనే అబద్దాలు పార్టీ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఢిల్లీ నాయకులు వరి మేము తీసుకోం అంటారు. రాష్ట్ర బీజేపీ నాయకులు వరిసాగు చేయడంని రైతులను గందోరగోళ పరిస్థితికి గురిచేస్తున్నారన్నారు. యాసంగి ధాన్యం కొనకుంటే బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రానీయొద్దని రైతులకు ఎంపీ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు మోసపూరిత హామీలు ఇస్తూ ద్వంద్వ వైఖరిని అవలబింస్తున్నారన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన చావు డప్పు కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ హాజరై మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు అందరం కలసి నిరసన తెలిపామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బాయిల్డ్ రైస్ కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. నిజాంపేట మండలం పూర్తిగా వ్యవసాయధారిత ప్రాంతమని, 90 శాతం రైతులు వరి సాగు చేస్తారని అన్నారు. బీజేపీ నాయకులు ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నారు, గల్లీలో ఏం మాట్లాడుతున్నారో రైతులు గ్రహించాలన్నారు.

అనంతరం మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో చావు చప్పుడుతో నూతన బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రామాయంపేటలో కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లే జితేందర్ గౌడ్, రామాయంపేట ఏఎంసీ చైర్మన్ సరఫ్ యాదగిరి, రామాయంపేట, నిజాంపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బండారి మహేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందె ఇందిరా, పీఏసీఎస్ చైర్మన్లు బాదే చంద్రం, అందె కొండల్ రెడ్డి, బాపురెడ్డి, నిజాంపేట సర్పంచ్ అనూష, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు. టీఆర్ ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.


Next Story