జైలుకు వెళ్లేందకు సిద్ధంగా ఉన్నా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by  |
JC Prabhakar Reddy
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ ప్రభుత్వంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెచ్చగొట్టేలా వ్యవహరించానంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆయన స్పందించారు. రాజకీయ కక్షతో తనపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తనపై 72 కేసులు పెట్టారని స్పష్టం చేశారు. మరో నాలుగు కేసులు పెట్టుకోవాలని సూచించారు. తాను జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై దారుణంగా ఉందని మండిపడ్డారు. కొందరు పోలీసులు పాలకులు ఒత్తిడి మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు.

తాడిపత్రిలో ఓ అధికారి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తోటకు వెళ్లి నమస్కారం పెట్టివస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారని వాటిపై రాష్ట్ర హోంమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఫిర్యాదు చేశానని..అయితే ఇప్పటి వరకు స్పందనలేదని విమర్శించారు. సిన చర్యలు శూన్యమన్నారు. నిన్ను కొడతా.. రెండు సెకండ్లలో ఊరి విడిపిస్తా అని మాట్లాడటం రెచ్చగొట్టడం కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకే తాను సమాధానం చెప్పానని దానికే కేసు నమోదు చేస్తారా అనిప్రశ్నించారు. మరి ఎమ్మెల్యేపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని నిలదీశారు. తాను అరెస్టులకు భయపడే వాడిని కాదన్నారు. పోలీసులు రమ్మంటే పోతావుంటాము. ఎవరొస్తే వాళ్లను సతాయిస్తారంటే…రేపు ప్రభుత్వం మారితే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నీ తెలుసుకుని ప్రవర్తించాలని పోలీసులకు, ఇతర అధికారులకు జేసీ ప్రభాకర్‌రెడ్డి హితవు పలికారు.


Next Story

Most Viewed