‘వకీల్‌ సాబ్‌’కు భారీ రెమ్యునరేషన్

by  |
Pawan Kalyan, Vakil Saab
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో అరుదైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఈయన సినిమాల్లో ఏం మత్తు ఉంటుందో.. ఆయన ఏం మాయ చేస్తాడో తెలియదు కానీ పవన్ అనే పేరు వినగానే అభిమానుల్లో ఆనందం రేకెత్తుతుంది. చేసిన సినిమాల్లో సగానికి పైగా ఫ్లాపులే ఉన్నా.. పవర్ స్టార్ అంటే ఏదో తెలియని ఆసక్తి.. ఆయన సినిమాలంటే అభిమానులకు పిచ్చి. ఇప్పుడు కూడా ఆయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న వకీల్ సాబ్ చిత్రం పూర్తయింది. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.

అయితే.. అజ్ఞాత వాసి చిత్రం అనంతరం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. దాదాపు మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్’ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండింటిపైనా దృష్టి సారిస్తూ.. జోడుగుర్రాల స్వారీ చేస్తున్నారు. ఎక్కువగా రాజకీయాల్లోనే గడుపుతూ.. తనకు వీలుకుదిరినప్పుడే వచ్చి షూటింగ్‌లో పాల్గొంటున్నాడని సమాచారం. దర్శక, నిర్మాతలు కూడా పవన్ డేట్‌లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా సమయం ఇచ్చినప్పుడే వెంట వెంటనే పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కేవలం తెలుగులోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఒక్క తెలుగు భాషలోనే తీస్తున్న సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు. ‘వకీల్ సాబ్’ కోసం ఏకంగా రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. కాగా, తెలుగులో ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ కావడం విశేషం.



Next Story

Most Viewed