- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాని ‘టక్ జగదీష్’ విడుదల వాయిదా
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లో మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవలే నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’ విడుదల కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్స్ ట్విటర్ వేదికగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లో మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవలే నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’ విడుదల కూడా వాయిదా పడింది.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ‘‘ప్రస్తుతం నెలకొన్న కారణాల వల్ల ‘టక్ జగదీష్’ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. తదుపరి విడుదల తేదీ త్వరలోనే ప్రకటిస్తాం’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తుండగా, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.
Hi 🙂 #TuckJagadishPostponed pic.twitter.com/byQwprFTHA
— Nani (@NameisNani) April 12, 2021






