- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపులర్ ఫిమేల్ సింగర్ కన్నుమూత
<p>దిశ, సినిమా : పాపులర్ ఒడియా సింగర్ తపు మిశ్రా(36) కన్నుమూసింది. తను పోస్ట్ కొవిడ్-19 కాంప్లికేషన్స్‌తో ప్రైవేట్ హాస్పిటల్‌లో కొంతకాలంగా చికిత్స పొందుతోంది. కాగా ఆక్సిజన్ లెవెల్స్ 45కు పడిపోవడంతో రెండు రోజుల నుంచి వెంటలేటర్ సపోర్ట్‌పై ఉన్న మిశ్రా.. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మే 19న హాస్పిటల్‌లో అడ్మిట్ కాగా, ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఇక ‘కులనందన్’ అనే ఒడియా […]</p>

దిశ, సినిమా : పాపులర్ ఒడియా సింగర్ తపు మిశ్రా(36) కన్నుమూసింది. తను పోస్ట్ కొవిడ్-19 కాంప్లికేషన్స్‌తో ప్రైవేట్ హాస్పిటల్‌లో కొంతకాలంగా చికిత్స పొందుతోంది. కాగా ఆక్సిజన్ లెవెల్స్ 45కు పడిపోవడంతో రెండు రోజుల నుంచి వెంటలేటర్ సపోర్ట్‌పై ఉన్న మిశ్రా.. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మే 19న హాస్పిటల్‌లో అడ్మిట్ కాగా, ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయినట్టు డాక్టర్లు వెల్లడించారు.
ఇక ‘కులనందన్’ అనే ఒడియా ఫిల్మ్‌తో సింగర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన మిశ్రా.. 150కి పైగా చిత్రాల్లో పాటలు పాడింది. అంతేకాదు రెండు దశాబ్దాల కెరియర్‌లో అనేక భజన పాటలతో ఫేమ్ సంపాదించింది. తన మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు నివాళులు అర్పిస్తుండగా.. మిశ్రా మరణం మ్యూజిక్ వరల్డ్‌కు తీరని లోటని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె తండ్రి కూడా మే 10న కరోనాకు బలయ్యారు.






