షారుఖ్ ఫ్యాన్‌ను తిట్టిపోసిన పూజా భట్

by  |
pooja bhat
X

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూజా భట్.. షారుఖ్ ఖాన్ ఫ్యాన్‌పై ఫైర్ అయింది. ‘అత్యాచారం అనేది ఒక పొలిటికల్ యాక్ట్. ఇది కేవలం లింగ హింసకు సంబంధించినది కాదు. లొంగదీసుకునేందుకు, హింసించేందుకు, అవమానపరిచేందుకు, చివరికి నియంత్రణ సాధించేందుకు ఉపయోగించబడుతుంది’ అని ట్వీట్ చేసింది. దీనిపై కామెంట్ చేసిన ఎస్‌ఆర్‌కే ఫ్యాన్.. దీని మీద మాకు లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు.

దీంతో ఫైర్ అయిన పూజా భట్.. ‘నన్ను కంట్రోల్ చేసేందుకు నువ్వు ప్రయత్నించకు. షారుక్ అభిమాని అంటున్నావు కదా అతని నుంచి నేర్చుకోండి. షారుక్ మహిళల అభిప్రాయాలను ఎప్పటికీ తోసిపుచ్చడు. మీరు అతనిలా ఉండలేకపోతే, అతని ఫోటోను నీ ప్రొఫైల్ నుంచి తీసేయ్’ అని సలహా ఇచ్చింది.

Next Story

Most Viewed