- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో చేరిన YS షర్మిల ఫస్ట్ ట్వీట్ ఇదే!
సుదీర్ఘ చర్చల తర్వాత ఇవాళ ఎట్టకేలకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ చర్చల తర్వాత ఇవాళ ఎట్టకేలకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆమెకు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం షర్మిల సోనియా, రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరికపై ట్విట్టర్ వేదికగా తొలిసారి స్పందించారు. ‘‘YSR తెలంగాణ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యూలర్ పార్టీ. దేశ పునాదుల నుండి నిర్మాణం వరకు కాంగ్రెస్ హస్తం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని వైయస్ఆర్ చివరి కోరిక. ఆయన కోరిక నిజం చేసేందుకు కృషి చేస్తాం’’ అని షర్మిల ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Next Story






