Chandrababu Naidu అరెస్ట్‌తో ఇండస్ట్రీకేంటి సంబంధం..! స్టార్ హీరో సోదరుడు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 7 |
Chandrababu Naidu అరెస్ట్‌తో ఇండస్ట్రీకేంటి సంబంధం..! స్టార్ హీరో సోదరుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, దర్శకుడు హేమంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘సప్త సాగరాలు దాటి: సైడ్ ఏ’. రక్షిత్ శెట్టి సొంత బ్యానర్‌లో నిర్మించబడిన ఈ మూవీ సెప్టెంబర్-22న తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మూవీ టీం. తాజాగా.. ప్రమోషనల్ ఈవెంట్‌లో సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు చంద్రబాబు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు సైతం స్పందించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తప్పుబట్టారు. కానీ ఎన్టీఆర్ బ్రదర్స్ రియాక్ట్ కాలేదు. దీనిపై నెట్టింట పెద్ద రచ్చే నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడాలి కానీ స్పందించడం లేదు అంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. స్పప్త సాగరాలు దాడి: సైడ్ A సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దగ్గుబాటి సురేష్ బాబు‌కు.. చంద్రబాబు అరెస్ట్‌పై ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉంది. అందుకే సెన్సిటివ్ విషయాలపై సినీ ఇండస్ట్రీ నుంచి స్పందన ఉండదు’’ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌కు మాకు ఎలాంటి సంబంధం ఉండదు అంటూ ఇండరెక్ట్‌గా చెప్పిన దగ్గుబాటు సురేష్ బాబు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్న ‘సప్త సాగరాలు దాటి’ ట్రైలర్


Next Story