TVK చీఫ్ తలపతి విజయ్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

తమిళనాడు(Tamil Nadu)లోని పరందూర్‌లో టీవీకే(TVK) పార్టీ చీఫ్ తలపతి విజయ్(Thalapathy Vijay) పర్యటించారు.

TVK చీఫ్ తలపతి విజయ్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లోని పరందూర్‌లో టీవీకే(TVK) పార్టీ చీఫ్ తలపతి విజయ్(Thalapathy Vijay) పర్యటించారు. పరందూర్‌లో ఎయిర్‌పోర్టు(Parandur Airport) నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు(Tamil Nadu Farmers) చేస్తున్న ఆందోళనకు విజయ్ సోమవారం మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల రాజకీయం కోసం తాను ఇక్కడకు రాలేదని అన్నారు. రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపేందుకే వచ్చానని స్పష్టం చేశారు. రైతుల కోసం తాను పరందూర్‌(Parandur) వస్తుంటే అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేదా? అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. పచ్చని పంట పొలాలు ధ్వంసం చేస్తే ఊరుకోవాలా? సీరియస్ అయ్యారు. రైతుల ఉద్యమానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తలపతి విజయ్ తన 69వ సినిమా తర్వాత ఒక నెల విశ్రాంతి తీసుకుని 70వ సినిమా స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తారని సమాచారం. దానికి తగ్గట్టుగానే ఈ మూవీస్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

Next Story