- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి అభ్యర్థిగా దళపతి విజయ్
తమిళనాడులో హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) తమిళగ వెట్రి కళగం పార్టీ(TVK Party)ని స్థాపించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) తమిళగ వెట్రి కళగం పార్టీ(TVK Party)ని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి మహానాడును ఏర్పాటు చేసి సిద్ధాంతాలు, ఆశయాలు ప్రకటించారు. తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తో్న్న వేళ టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని గతంలోనే స్పష్టం చేసింది.
సినిమా ఇండస్ట్రీతో పోల్చిస్తే రాజకీయాలు సీరియస్ అని తెలిపిన విజయ్.. రాజకీయాల్లో తనకు అనుభవం లేకపోయినా.. భయపడనని వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజల కోసం తన సినీ కెరీర్ వదిలేసి వచ్చానని.. వారి కోసమే పోరాడుతానని తేల్చి చెప్పారు.






