TDP Vs YSRCP: టీడీపీ Vs వైసీపీ.. ట్విట్టర్‌ వార్

by Disha Web Desk 3 |
TDP Vs YSRCP: టీడీపీ Vs వైసీపీ.. ట్విట్టర్‌ వార్
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీకి, ప్రతిపక్షమైన టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. గెలుపు నాది అంటే కాదు నాదే అంటూ ఇరు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా టీడీపీకి వైసీపీకి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. తాజాగా టీడీపీ రానున్న ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏ కూటమిదేనని డజనుకు ఒకటి తక్కువ 11 సర్వేలు వెల్లడించాయని.. అలానే ఓటమి బాటలో వైసీపీ అంటూ తమ అంచనాలు వెల్లడించాయని ట్వీట్‌లో సర్వే లిస్ట్‌ను పోస్ట్ చేసింది.

కాగా ఈ ట్వీట్‌పై వైసీపీ స్పందించింది. ఇప్పటికి ట్వీట్ మాత్రమే డిలీట్ చేసావు, ఇంకోసారి ఇలాంటి తప్పుడు సర్వేలు, తప్పుడు మాటలు కూస్తే ఏకంగా మీ పార్టీనే డిలీట్ చేయాల్సి వస్తుంది. చూస్కో మరి.. అసలే మా కుర్రోళ్లు ఉడుకు రక్తంతో ఉన్నారు, మీరు ఏ తప్పుడు పని చేసినా ఈ మద్య ఇట్టే పట్టేస్తున్నారు అంటూ ఘాటుగా రీట్వీట్ చేసింది.

అయితే టీడీపీ ట్వీట్‌ను డిలీట్ చెయ్యలేదు. దీనితో వైసీపీ ట్వీట్‌పై టీడీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్ళు కాకులు ఎత్తుకెళ్లాయారా, ఉదయం లేచినప్పటి నుండి చెత్త ట్వీట్లు, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేది మీరు. అందుకే మా కుర్రోళ్ళు మీ ఫేక్ ట్వీట్లు, పనులు పట్టేస్తున్నారు. అందుకే ఫ్రస్టేషన్‌లో ఉన్నావు. పర్మినెంట్ గా మీ పార్టీని డిలేట్ చెయ్యడానికి ప్రజలు రెడీగా ఉన్నారు అని కామెంట్లు చేస్తూ టీడీపీ ట్వీట్‌ను వైసీపీ ట్వీట్ కామెంట్ లో పిన్ చేస్తున్నారు.


Next Story

Most Viewed