పైన నాది.. కింద పవన్ కళ్యాణ్‌ది.. వర్మ ట్వీట్‌పై జనసేన పార్టీ గరం గరం

by Chukka Sudharani |   (  Updated:2023-09-11 08:48:29  IST  )

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Ram Gopal Varma Controversial Comments On NDAs Presidential Candidate Draupadi Murmu
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడిని నిన్న రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే.. మాజీ సీఎం అరెస్ట్ అనంతరం భువనగిరిలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును కలిసేందుకు విజయవాడ రాగా.. పోలీసులు పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే పవన కల్యాణ్ రోడ్డుపై పడుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇలా నిరసన తెలిపిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. ఆ ఫొటోలను అస్త్రంగా చేసుకుని వర్మ ఓ సెటైరికల్ ట్వీట్ విసిరారు.. ‘‘పైన నేను నెల క్రితం రిలీజ్ చేసిన “వ్యూహం” సినిమా ఫొటో.. కింద నిన్న రాత్రి రోడ్డు మీద తీసిన రియల్ ఫొటో’’ అంటూ పవన్ ఫొటోలను షేర్ చేశాడు వర్మ. ఈ ట్వీట్ కాస్త వైరల్ కావడంతో నెట్టింట పవన్ కల్యాణ్ ఫ్యాన్ వార్ షురూ చేశారు.

Next Story