- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం.. పాపంలో కేసీఆర్ పాత్ర కూడా.. వీడియో సాక్ష్యం ఇదిగో!
తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు తమ సొంత ఇంట్లో వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికీ నిజమని.. కేటీఆర్‌తో కలిసి తన అన్న జగన్

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు తమ సొంత ఇంట్లో వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికీ నిజమని.. కేటీఆర్‌తో కలిసి తన అన్న జగన్.. తన ఫోన్ కూడా ట్యాప్ చేశాడని వైఎస్ షర్మిల చెప్తుంటే.. జగన్ మోహన్ రెడ్డి మాత్రం వాళ్లు ఫోన్ ట్యాప్ చేస్తే నాకేంటి సంబంధం అన్నట్లుగా మాట్లాడాడు. అయితే నిజంగానే ఫోన్ ట్యాప్ జరిగిందనే విషయానికి ఇదే ఉదాహరణ అన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగిన పంచాగ శ్రవణంలో పంతులు చెప్పిన మాటలను బట్టి ఇదంతా నిజమేనని స్పష్టమవుతుందంటున్నారు నెటిజన్లు.
ఇక ఈ వీడియోలో ‘నరసింహుడికి త్రినేత్రం ఉంది. అలాగే మన చంద్రశేఖర్ రావుకు కూడా మూడో నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో? ఎవరిని కలుస్తున్నారో? ఎవరితో మాట్లాడుతున్నారో ఆయనకు తెలుస్తుంది. అందుకే నాయకులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా’ అంటూ పంతులు చెప్పుకొచ్చాడు. ఈ మాటలకు కేసీఆర్ కూడా అవునన్నట్లుగా నవ్వాడు. ఇక వీడియో చూసిన నెటిజన్లు.. ఇదేం గెస్సింగ్ పంతులు సూపర్ అస్సలు అని కొందరు కామెంట్ చేస్తుంటే.. త్రినేత్రం కాదు ఫోనేత్రం అని, ఆయన కరెక్ట్‌గానే చెప్పాడు మాకే చాలా లేట్‌గా అర్థమైందని ఇంకొందరు రిప్లయ్ ఇస్తున్నారు.






