ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అమ్మాయిల సప్లై.. ఆ హోటల్‌లోనే అంతా ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-09 13:07:12  IST  )

బీహార్ ఎలక్షన్స్‌ ఫస్ట్ ఫేజ్ విజయవంతంగా ముగిసింది. కానీ సమరం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఒత్తడిలో పంచాయతీ నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు ఓ ఏజెన్సీ పని చేస్తున్నట్లు తేలింది. ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన ‘

ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అమ్మాయిల సప్లై.. ఆ హోటల్‌లోనే అంతా ..
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ ఎలక్షన్స్‌ ఫస్ట్ ఫేజ్ విజయవంతంగా ముగిసింది. కానీ సమరం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ ఒత్తడిలో పంచాయతీ నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు ఓ ఏజెన్సీ పని చేస్తున్నట్లు తేలింది. ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’లో ఇందుకు సంబంధించిన రహస్యాలు బయటపడ్డాయి. పాట్నాలోని హోటల్ బెల్లీ గ్రాండ్ చుట్టూ ఈ నెట్ వర్క్‌కు సెంటర్ పాయింట్‌గా ఉన్నట్లు తేలింది. ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీలకు డిమాండ్ మీద ఒకేసారి 100 మంది అమ్మాయిలను సప్లయ్ చేస్తున్నట్లు స్ట్రింగ్ ఆపరేషన్‌లో తేలింది. వీరికి ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి మనీ పే చేస్తారని.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢల్లీ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు నేపాల్, థాయ్‌లాండ్ నుంచి అమ్మాయిలను తెప్పిస్తున్నట్లు గుర్తించబడింది.

ముఖ్యంగా పేదరికంలో ఉన్న ఏరియాలకు చెందిన అమ్మాయిు... ఇంగ్లీష్ మాట్లాడే వారికి ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫారిన్ ఉమెన్ అయితే స్పెషల్ ట్రీట్మెంట్, భారీ ఫీజులు చెల్లంచబడుతున్నట్లు సమాచారం. ఇక వీరితోపాటు డ్రగ్స్ డీల్స్ కూడా జరుగుతున్నాయట. పగలు, రాత్రి, ఎక్స్‌ట్రా టైమ్‌ను బట్టి కూడా రేట్స్, రివార్డ్స్ ఇవ్వబడుతున్నాయట. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. టీవీలో నీతి వాక్యాలు చెప్తూ చాటున ఈ బాగోతం నడిపిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి లీడర్లు జనాల బాగోగులు ఏం చూస్తారనే ప్రశ్న కూడా వినిపిస్తుంది.

Next Story