- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్‌కు ప్రధాని విషెస్.. ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బర్త్ డేను ట్రెండింగ్‌లో దూసుకుపోయేలా చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించిన కొందరు అభిమానులు..

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బర్త్ డేను ట్రెండింగ్‌లో దూసుకుపోయేలా చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించిన కొందరు అభిమానులు.. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని గొప్ప పదవులు అలంకరించాలని కోరుకుంటున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కూడా పవన్ పుట్టినరోజున ఘనంగా విష్ చేస్తుండగా.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
‘శ్రీ పవన్ కళ్యాణ్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎంతో మంది ప్రజల హృదయాల్లో, మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనపై దృష్టి సారించి ఎన్‌డిఎను బలోపేతం చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పవన్ అభిమానులు మురిసిపోతున్నారు. మోడీకి థాంక్స్ చెప్తూ లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.






