కవిత సస్పెండ్ : ఎంత పెద్దోళ్లైనా సరే.. యాంటీ పార్టీ పోతే తీసి అవుతల పారేస్తం.. కేసీఆర్ వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-02 10:32:08  IST  )

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్. ఆమె మాటలు, చేతలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునా సస్పెండ్

కవిత సస్పెండ్ : ఎంత పెద్దోళ్లైనా సరే.. యాంటీ పార్టీ పోతే తీసి అవుతల పారేస్తం.. కేసీఆర్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్. ఆమె మాటలు, చేతలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందనా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు మంచి ముహూర్తం కూడా ఖరారైందని సమాచారం. కాగా బీఆర్ఎస్ నుంచి సొంత కూతరును సస్పెండ్ చేయడంపై తెలుగు రాష్ట్రాలతోపాటు నేషనల్ మీడియా ఈ న్యూస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా కవర్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. ఎంత పెద్దోళ్లైనా సరే.. హండ్రెడ్ పర్సెంట్ తీసి అవుతల పారేసుడే.. వాళ్ల కర్మ వాళ్లే పోతరు’ అనే వ్యాఖ్యలతో కూడిన కేసీఆర్ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. మరోవైపు కవితను పార్టీ నుంచి బహిష్కరించడంపై గులాబీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Next Story