- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలారోజులకు ఎదురుపడ్డ కవిత-జగదీష్ రెడ్డి.. ఎలా పారిపోయాడంటే?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఒకరిపై మరొకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ.. సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కవిత నల్గొండలో ఓటు బ్యాంక్ కోల్పోవడానికి కారణం

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఒకరిపై మరొకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ.. సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కవిత నల్గొండలో ఓటు బ్యాంక్ కోల్పోవడానికి కారణం అతనేనని.. బీఆర్ఎస్‌లో పెత్తనం చేస్తున్న లిల్లీపూట్ నాయకుడు అంటూ విమర్శించింది. కేసీఆర్ లేకపోతే ఇతను ఎవరని.. తాను కేసీఆర్‌కు రాసిన లేఖను లీక్ చేసింది ఇతనేనని ఆరోపించింది. ఇక దీనిపై స్పందించిన జగదీష్ రెడ్డి.. కవిత ఒక్క ఎమ్మెల్సీ మాత్రమేనని, బీఆర్ఎస్ పన్నెండు సీట్లు గెలిచేందుకు కృషి చేసింది తానేనని, రాజకీయ కుట్రల వల్ల మాత్రమే సీట్లు కోల్పోయామని చెప్పుకొచ్చాడు.
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల దాడులు కొనసాగుతుండగా.. తాజాగా ఓ నాయకుడి కుటుంబానికి సంబంధించిన పెళ్లికి ఇద్దరు అతిథులుగా వెళ్లారు. కవితక్క అందరితో కలిసి ఫొటోలు దిగుతుంటే.. అటువైపు నుంచి వెళ్తున్న జగదీష్ రెడ్డి.. ఆమెను చూసి పక్కకు తప్పుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. కవితక్కను చూసి పారిపోయిన నల్లగొండ లిల్లీపూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కవిత అభిమానులు.






