- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటక సీఎం పదవి.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
కర్ణాటక సీఎం పదవిపై పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సీఎం పదవిపై పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి వెళ్లిన తర్వాత డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. నన్ను నమ్మి ప్రజలు 135 సీట్లలో పార్టీని గెలిపించారన్నారు. తాను, ఢిల్లీ వెళ్తానో లేదో తెలియదన్నారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నామీద నమ్మకంతో సోనియా నన్ను పీసీసీ చీఫ్ చేశారన్నారు.
నా బర్త్ డే కు సోనియా ఏం గిఫ్ట్ ఇస్తారో తెలియదన్నారు. కాంగ్రెస్ హై కమాండ్‌కే సీఎం ఎంపిక నిర్ణయాన్ని వదిలేశానన్నారు. బీజేపీ నాపై తప్పుడు కేసులు పెట్టి వేధించినప్పుడు సోనియా అండగా నిలిచారన్నారు. సీఎం ఎవరన్నది పార్టీ హై కమాండ్ నిర్ణయిస్తుందన్నారు. నేను చేయాల్సినదంతా చేశానన్నారు. అయితే ఇప్పటికే 135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పార్టీ నుంచి వచ్చిన ఏఐసీసీ పరిశీలకులు తీసుకున్నారు.
Read more:






