- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోగులకు ఇచ్చిన పండ్లను లాక్కున్న బీజేపీ నేతలు
రాజస్థాన్ జైపూర్‌కు చెందిన బీజేపీ నేతల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీజేపీ కార్యకర్త క్యాన్సర్ రోగికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి.. తిరిగి లాక్కున్న వీడియో ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ జైపూర్‌కు చెందిన బీజేపీ నేతల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీజేపీ కార్యకర్త క్యాన్సర్ రోగికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి.. తిరిగి లాక్కున్న వీడియో ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. సేవా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పేదలు, రోగులకు ఉచితంగా పండ్లు, కూరగాయలు ఇవ్వాలని పిలుపునిచ్చింది బీజేపీ అధిష్టానం.
ఈ క్రమంలోనే ఆర్‌యూహెచ్ఎస్ హాస్పిటల్‌లో ఉన్న రోగులకు బీజేపీ నాయకులు ఆహారం పంపిణీ చేశారు. ఇక్కడే ఓ మహిళా కార్యకర్త.. ఓ క్యాన్సర్ రోగికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మళ్లీ లాక్కున్న వీడియో వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘దానం చేయండి.. ఫొటో తీయండి.. లాక్కొండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై వివరణ ఇఛ్చాడు షియోపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపాల్ లాల్ షైనీ. రోగికి ఆల్రెడీ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడంతో రెండో ప్యాకెట్ తీసుకునేందుకు నిరాకరించాడని.. దీంతో మళ్లీ తీసుకున్నామని క్లారిటీ ఇచ్చాడు.






