ఆ మంత్రులు క్రిమినల్స్.. పచ్చినిజాలు బట్టబయలు..

by Sujitha Rachapalli |

కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్ సభలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఇందులో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేయబడి, వరుసగా 30రోజులు కస్టడీలో ఉంటే వారిని పదవి నుంచి తొలగించాలని సూచిస్తుంది. 31వ రోజు రాజీనామా చేయాలని..

ఆ మంత్రులు క్రిమినల్స్.. పచ్చినిజాలు బట్టబయలు..
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్ సభలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఇందులో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ చేయబడి, వరుసగా 30రోజులు కస్టడీలో ఉంటే వారిని పదవి నుంచి తొలగించాలని సూచిస్తుంది. 31వ రోజు రాజీనామా చేయాలని.. లేదంటూ పీఎంను రాష్ట్రపతి తొలగిస్తే.. సీఎం, మంత్రులను గవర్నర్ తొలగిస్తారు. ఈ బిల్లులు రాజకీయంలో క్రిమినలైజేషన్‌ను అరికట్టేందుకు ఉపయోగపడుతాయని, రాజ్యాంగపరమైన నైతికతను పాటించేందుకు ఉద్దేశించబడుతాయని చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. ఈ క్రమంలో ఎన్నికల సంస్కరణల గురించి పనిచేసే ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) సంస్థ.. దేశంలోని మంత్రుల నేరాల చిట్ట గురించి బయటపెట్టింది. దాదాపు 47శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపింది. హత్య, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యాలు వంటి తీవ్రఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. కాగా వీటన్నింటిని స్వయంగా వారే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా నివేదిస్తారు.

Next Story