ఎన్నికల హీట్ పెంచుకుతున్న హొలీ.. విరివిగా అమ్ముడుపోతున్న ఆ పార్టీ రంగులు..

by Disha Web Desk 3 |
ఎన్నికల హీట్ పెంచుకుతున్న హొలీ.. విరివిగా అమ్ముడుపోతున్న ఆ పార్టీ రంగులు..
X

దిశ వెబ్ డెస్క్: చిన్నా పెద్దా తేడా లేకుండా జరుపుకునే పండుగ హొలీ.. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా హొలీ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే ఈ సంవత్సరం రానున్న హొలీ ఎన్నికల హీట్ పెంచుతున్నాయి. విరాల్లోకి వెళ్తే.. రేపు దేశవ్యాప్తంగా హొలీ పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో హొలీ రంగులుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి.

ఇక ఎన్నికల సమయం కావడంతో వివిధ పార్టీల అభిమానులు తమకు నచ్చిన పార్టీ రంగులను కొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలల్లో కాషాయం రంగు విరివిగా అమ్ముడుపోతోంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు హోలీని ప్రచారం కోసం వాడుకుంటున్నాయి. ఇక అయోధ్యలో తొలిసారి జరగనున్న హొలీకి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక హొలీ సందర్భంగా బాల రామునికి యాభై రకాల నైవేద్యాలను సమర్పించనున్నారు. అలానే అయోధ్య బలరాముని కోసం పూలతో రంగులను తాయారు చేయనున్నారు.




Next Story

Most Viewed