- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో సంచలన చట్టం.. ఇక వారు ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదా?
దేశంలో జనాభా పెంచాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఇద్దరు పిల్లలు కంటే తక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హత ప్రకటించే విషయంపై ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జనాభా పెంచాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఇద్దరు పిల్లలు కంటే తక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హత ప్రకటించే విషయంపై ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొదట ఆయన హెలిప్యాడ్వద్ద కూటమి ఎమ్మెల్యేలు, నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బుడగట్లపాలెంలో గ్రామ దేవతలు శ్రీ సింగాలమ్మ, శ్రీ కొత్తమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. తర్వాత నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ గతంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరి కంటే ఎక్కవ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హత విధిస్తూ చట్టం తెచ్చానన్నారు. ఇప్పుడు జనాభా పెంపు కోసం ఆ చట్టాన్ని రద్దు చేశామని వెల్లడించారు. ఇక సముద్ర తీర ప్రాంతం ద్వారా సంపద సృష్టించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.
జూన్‌లో తల్లికి వందనం
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్హామీలను పూర్తి చేసి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే పింఛన్లు, ఉచిత గ్యాస్, మెగా డీఎస్సీ తదితర పథకాలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు మత్స్యకారుల సేవా పథకం ద్వారా వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. జూన్‌లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని వెల్లడించారు. 32 శాతం మత్య్ససంపద రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతోందన్నారు. తద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి దొరుకుతోందని తెలిపారు. మత్య్సకారుల పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆరు రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎచ్చెర్లలో నైపుణ్య శిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు.
మత్స్యకారులతో మమేకం
ఈ సందర్భంగా పలు మత్య్సకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వారితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదట సముద్రతీరంలో మత్య్సకార కుటుంబం మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడారు. అనంతరం కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించారు. అనంతరం ఎండుచేపలను పరిశీలించారు. మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ ఆదాయం గురించి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న సీఎం చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు.






