గ్రామాల అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వండి: Thalloju Achary

by Taduka Kalyani |   (  Updated:2023-07-18 14:25:23  IST  )

కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వండి అని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ప్రజలను కోరారు.

గ్రామాల అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వండి: Thalloju Achary
X

దిశ, తలకొండపల్లి: కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వండి అని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ప్రజలను కోరారు. మండలంలోని బూత్ స్వశక్తి కర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 10 గ్రామాలలో మంగళవారం గౌరిపల్లి, ఖానాపూర్, కర్కాస్ తండా, జంగారెడ్డిపల్లి, మెదక్ పల్లి, గడ్డమీద తండా, ఆర్లకుంట తండా, వెంకటరావుపేట్, కోరింటకుండా తండా, గట్టు ఇప్పలపల్లిలో విస్తృతంగా పర్యటించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించారు.

ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ఆచారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కల్వకుర్తికి పట్టిన ప్రగతి నిరోధక ప్రజా ప్రతినిధులకు ఇక విముక్తి పలికి అభివృద్ధి కోసం పాటుపడే నేతలకు అవకాశం ఇవ్వాలని, 40 సంవత్సరాలుగా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని మీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని ఇప్పటికైనా బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆదరించి అభిమానించి ఓట్లు వేసి గెలిపించవలసిన అవసరం ఉందని ఆచారి తనదైన శైలిలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుమణి రవి గౌడ్, జిల్లా కార్యదర్శి పాండు ప్రసాద్, రాష్ట్ర యువమోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీలకంఠ పాండు, చంద్రధన సర్పంచ్ బక్కి కుమార్, తలకొండపల్లి ఉప సర్పంచ్ అనిల్, ఎంపీటీసీ హేమరాజు, నాయకులు ఇమ్మిడి మహేష్, జంగయ్య, రాజు, కుమార్, లక్ష్మణ్, శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్ ఆనందు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story